సౌదీ బాధితుల కోసం ప్రత్యేక విమానం
HYD: సౌదీ అరేబియా ప్రమాద ఘటనలో బాధితుల కోసం శంషాబాద్ నుంచి సౌదీకి ప్రభుత్వం ప్రత్యేక విమానం ఏర్పాటు చేసింది. మృతులను గుర్తించడంతో పాటు వారి అంతిమ సంస్కారాలు అక్కడే నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. ఇవాళ రాత్రి 8:30 గంటలకు నాంపల్లి నుంచి సౌదీకి ఒక్కో కుటుంబానికి ఇద్దరు చొప్పున తీసుకెళ్లనుంది. కాగా, ఈ ప్రమాదంలో 45 మంది హైదరాబాదీలు మృతి చెందిన విషయం తెలిసిందే.