'స్క్రబ్ టైఫస్ పట్ల అప్రమత్తత అవసరం'
కోనసీమ: ఇటీవల స్క్రబ్ టైఫస్ వ్యాధి పట్ల ప్రజలలో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో రామచంద్రపురం UPHC మెడికల్ ఆఫీసర్ హేమ సుధీర్ మంగళవారం మీడియా తో మాట్లాడారు. నల్లిని పోలిన కీటకం కుట్టడం వల్ల ఈ వ్యాధి వస్తుందన్నారు. జ్వరం, వాంతులు, ఒంటి నొప్పులు, పొడి దగ్గు, రొంప ప్రాథమిక లక్షణాలన్నారు. ఈ వ్యాధి పట్ల ప్రజలకు ఆందోళన వద్దని, అప్రమత్తంగా ఉండాలని సూచించారు.