రోడ్లపై ధాన్యం రాశులు.. వాహనదారుల బెంబేలు!
MDK: రామాయంపేట-దౌల్తాబాద్ రహదారిపై ధాన్యం ఆరబోయడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. సగం రోడ్డు బ్లాక్ అవ్వడంతో వాహనాలు ఎదురెదురుగా వచ్చి ప్రమాదాలు జరుగుతాయని డ్రైవర్లు వణికిపోతున్నారు. మహిళలు రోడ్లపైనే ఉంటూ వాహనాలను బేఖాతరు చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.