రైతులంటే నిర్లక్ష్యం ఎందుకు: బీఆర్ఎస్

రైతులంటే నిర్లక్ష్యం ఎందుకు: బీఆర్ఎస్

SDPT: తొగుట మండలంలో ధాన్యం, పొద్దుతిరుగుడు కొనుగోళ్లు నిలిచిపోవడంపై బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కొనుగోలు కేంద్రాల ప్రారంభంపై ఉన్న శ్రద్ధ, కొనుగోళ్లపై లేదని ఆరోపించారు. పది రోజులుగా మార్కెట్లో రైతులు ఎదురుచూస్తున్నా పట్టించుకోకపోవడం సరికాదన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోళ్లు ప్రారంభించాలన్నారు.