బీబీపేట్ మండలంలో వ్యక్తి పై పోక్సో కేసు నమోదు
KMR: కామారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. బీబీపేట్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి తన పదమూడేళ్ల కూతురిని లైంగికంగా వేధించాడు. నిత్యం వేధింపులు భరించలేక బాధితురాలు పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించింది. ఈ మేరకు తండ్రిపై సోమవారం పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్సై ప్రభాకర్ మంగళవారం తెలిపారు.