'పోడు భూముల సమస్యలు పరిష్కరించాలి'
BDK: బోటిగూడెం పంచాయతీ లో పోడుభూముల సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు భద్రాచలం ITDA పీఓ రాహుల్ ను శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గిరిజన రైతులు పోడుభూముల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోడు రైతులు పాల్గొన్నారు.