'మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలను స్మరించుకుంటాం'
TPT: స్వతంత్ర భారతదేశానికి తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని డీఆర్‌వో నరసింహులు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఆజాద్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ.. ఆయన సేవలను స్మరించుకుంటూ అందరికీ జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ సంఘ నేతలు, విద్యార్థులు పాల్గొన్నారు.