ముళ్లపొదల్లో నియంత్రణ బోర్డు.. వాహనాదారుల ఇబ్బందులు

నల్గొండ: కొండమల్లేపల్లి మండల పరిధిలో విస్తరించి ఉన్న హైదరాబాద్ - నాగార్జునసాగర్ రాష్ట్ర రహదారిపై చెట్లు ఏపుగా పెరగడంతో వేగ నియంత్రణ బోర్డు కనిపించడం లేదు. రాష్ట్ర రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకు వేగ నియంత్రణ బోర్డులను ఏర్పాటు చేశారు. అయితే చాలా చోట్ల చెట్ల కొమ్మలు పెరగడంతో బోర్డు వాహనదారులు కనిపించడం లేదు. దీంతో వాహనాదారులు సూచికలు కనిపించక నియంత్రణ కోల్పోయి ప్రమాదాల భారీన పడుతున్నారు.