గంజాయి బ్యాచ్‌పై 'డ్రోన్' అస్త్రం.. కడపలో హై అలర్ట్
కడప: నగరంలో గంజాయి, అసాంఘిక శక్తులపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఆదివారం ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ చిన్నపెద్దయ్య ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. బుగ్గవంక, పాత బస్టాండ్, నాగరాజుపేట ప్రాంతాల్లో అత్యాధునిక డ్రోన్ కెమెరాలను ఉపయోగించి గంజాయి వాడేవారిని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిని గుర్తించి అదుపులోకి తీసుకుంటున్నారు.