చిత్తూరులో ఘటనంగా టీడీపీ ఆవిర్భావ వేడుకలు
CTR: పేదల సంక్షేమం, తెలుగువారి ఆత్మగౌరవం కోసమే ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ తెలిపారు. చిత్తూరులో టీడీపీ ఆవిర్భావ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి, ఎన్టీఆర్ చిత్రపటానికి ఆయన నివాళులు అర్పించారు. ఎంతోమంది నాయకులు టీడీపీలో తయారు అయ్యారని ఆయన వెల్లడించారు. మహిళలకు అధిక ప్రాధాన్యం దక్కిందన్నారు.