విద్యాశాఖ మహిళా సిబ్బందికి సన్మానం..!
W.G: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆకివీడు మండల విద్యాశాఖ మహిళా సిబ్బందిని సోమవారం ఘనంగా సన్మానించారు. ఎంఈఓ-1 రవీంద్ర, ఎంఈఓ-2 రవికుమార్ ఆధ్వర్యంలో ఎంఐఎస్ కోఆర్డినేటర్ జె. ప్రశాంతి, సీఆర్ఎంటీలు శాంతి, పరమేశ్వరిలను సత్కరించారు. స్త్రీలు సంకల్పిస్తే ఏదైనా సాధించగలరని అధికారులు ఈ సందర్భంగా వారిని కొనియాడారు.