మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య

GNTR: మద్యం మత్తులో వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన తెనాలి పట్టణంలోని రామలింగేశ్వరపేట రైస్ కాలనీలో చోటు చేసుకుంది. తెనాలి 1వ పట్టణ పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. ప్రదీప్ జయచంద్ర (34) పెయింట్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసగా మారాడు. మద్యం సేవించడానికి కుటుంబసభ్యులు డబ్బులు ఇవ్వకపోవడంతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు తెలిపారు.