చిల్లేపల్లి‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు

చిల్లేపల్లి‌లో ఘనంగా వినాయక చవితి వేడుకలు

SRPT: జిల్లాలో నేరేడుచర్ల మండలం చిల్లేపల్లి గ్రామంలో బుధవారం వినాయక చవితి పండుగను భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. వర్షం కురుస్తున్నా భక్తులు స్వామి వారిని దర్శించుకుని కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు. వినాయకచవితి పండుగ ఘనంగా జరిగింది. ఉత్సవ కమిటీ సభ్యులు వచ్చిన భక్తులకు తగిన ఏర్పాట్లు చేశారు. అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.