రంజాన్ తోఫా పంపిణీ చేసిన అనంత వెంకటరామిరెడ్డి
ATP: రంజాన్ పర్వదినం పురస్కరించుకుని అనంతపురం రహమత్ నగర్‌లో వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి రంజాన్ తోఫా పంపిణీ చేశారు. 16వ డివిజన్ కన్వీనర్ సుకేశ్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు అందజేశారు. సేవా తత్వానికి ప్రతీక అయిన రంజాన్ సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని ఆయన కొనియాడారు.