రేపటి నుండి భోగనంజుండేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు  

రేపటి నుండి భోగనంజుండేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు  

CTR: పుంగనూరులోని శ్రీభోగ నంజుండేశ్వర స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నట్లు ఆలయ EO కమలాకర్ తెలిపారు. ఇందులో భాగంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. 25న ధ్వజారోహణం, 26న రుద్రాభిషేకాలు, సాయంత్రం కల్యాణోత్సవం, గ్రామోత్సవం ఉంటుందని చెప్పారు. 27వ తేదిన ప్రత్యేక పూజలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని వెల్లడించారు.