పాము కాటుతో వివాహిత మృతి

పాము కాటుతో వివాహిత మృతి

ప్రకాశం: జిల్లా దొనకొండ మండలం బాధాపురం గ్రామంలో బుధవారం పాముకాటుకు గురైన అక్కమ్మ అనే వివాహిత మృతి చెందింది. రుద్ర సముద్రం గ్రామానికి చెందిన అక్కమ్మ, హైదరాబాద్‌లో భర్తతో కలిసి కూలి పనులు చేసుకునేది. పొదుపు గ్రూపు పనిమీద మంగళవారం స్వగ్రామానికి వచ్చిన ఆమె, తెల్లవారుజామున నిద్రిస్తుండగా పాము కాటు వేసింది.