VIDEO: తూప్రాన్ మండలంలో భారీ వర్షం

MDK: తూప్రాన్ మండలంలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. రాత్రి 8 గంటల ప్రాంతంలో ప్రారంభమైన భారీ వర్షం గంటకు పైగా కురుస్తూనే ఉంది. భారీ వర్షం కురుస్తుండడంతో లోతట్టు ప్రాంతాల్లోకి నీరొచ్చి చేరుతున్నట్లు ప్రజలు చెబుతున్నారు. పట్టణంలోని కిందివాడకట్టు ప్రాంతంలోకి భారీ నీరు రావడంతో ఇళ్లలోకి నీరు చేరుతున్నట్లు బాధితులు తెలిపారు.