ముగిసిన ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ
TG: పార్టీ ఫిరాయింపు అంశంపై MLAల విచారణ రెండో రోజు ముగిసింది. పోచారం శ్రీనివాస్ రెడ్డి, అరికెపూడి గాంధీని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారించారు. ఈనెల 12, 13 తేదీల్లో MLAలను మరోసారి ప్రశ్నించనున్నారు. కాగా అసెంబ్లీ ఎన్నికలో BRS తరపున గెలిచిన MLAలు పార్టీ ఫిరాయించడంపై చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టును బీఆర్ఎస్ ఆశ్రయించిన సంగతి తెలిసిందే.