పేదల సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం

సూర్యాపేట: పేదల సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని కౌన్సిలర్ లక్ష్మీకాంతమ్మ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని 27వ వార్డులో గృహజ్యోతి కింద విద్యుత్ సిబ్బందితో కలిసి మీటర్ రీడింగ్ తీసి లబ్ధిదారులకు జీరో బిల్లును అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజా పాలనలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తోందన్నారు.