'ఆపదలో ఉన్న వారికి ప్రభుత్వం అండగా నిలుస్తోంది'
SKLM: ఆపదలో ఉన్న వారికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఎమ్మెల్యే రవికుమార్ సతీమణి, మాజీ ఎంపీపీ ప్రమీల అన్నారు. ఆమదాలవలస మున్సిపాలిటీలో ఆమె మంగళవారం పర్యటించారు. ఈ మేరకు స్థానిక నాయకులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెట్టెక్కివలసకు చెందిన పీ.శ్రీనుకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన రూ.1.14 లక్షల చెక్కును అందజేశారు.