ఇళ్ల మంజూరు అవకతవకలపై కలెక్టర్‌కు ఫిర్యాదు

ఇళ్ల మంజూరు అవకతవకలపై కలెక్టర్‌కు ఫిర్యాదు

KNR: ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో అవకతవకలు జరుగుతున్నాయని సీపీఎం మండల కార్యదర్శి కవ్వంపల్లి అజయ్ జిల్లా కలెక్టర్‌ పమేలా సత్పతి‌కు వినతిపత్రం సమర్పించారు. అధికారులు సరైన పరిశీలన లేకుండా నాయకుల అనుచరులకు, ఇళ్లు ఉన్నవారికి లబ్ధి చేకూరుస్తున్నారని ఆయన ఆరోపించారు. కొత్తపల్లి పట్టణంలో నిజమైన లబ్ధిదారుల దరఖాస్తులను ఆన్‌లైన్ చేయకపోవడం వల్ల నిరుపేదలకు అన్యాయం జరుగుతోందని అన్నారు.