డ్రగ్స్‌పై ఈగల్ టీమ్ సోదాలు.. పలువురు అరెస్ట్
HYD: నగరంలో డ్రగ్స్ వినియోదారులపై పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారు. తాజాగా, ఇవాళ వేరు వేరు ప్రాంతాల్లో ఈగల్ టీమ్ సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలో డ్రగ్స్ సేవిస్తున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మేడిపల్లి(08), చిక్కడపల్లి(04), కూకట్‌పల్లి(03), ఎల్బీనగర్(02), వనస్థలి పురం, బాలాపూర్‌లో చెరొకరిని అదుపులోకి తీసుకున్నారు.