కలెక్టర్ ఆదేశాలతో స్పందించిన అధికారులు.

NTR: కంచికచర్ల మండలం కీసర నుంచి గండేపల్లి వెళ్లే రహదారి అధ్వానంగా ఉందని గురువారం జిల్లా కలెక్టర్ పర్యటనలో స్థానికులు సమస్యలు వివరించారు. కలెక్టర్ ఆదేశాలతో హుటాహుటిన స్పందించిన అధికారులు డ్రైనేజ్ పూడిక తీత పనులు ప్రారంభించారు. సరైన డ్రైనేజీ లేకపోవడంతో వర్షపు నీరు మురుగునీరు రహదారులపై నిలిచి స్థానిక ప్రజలు ఇబ్బందులు పడ్డారు.