రేపు జిల్లాలో ఉద్యోగ మేళా

కర్నూలు: జిల్లా ఉపాధికల్పన శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీన ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారిణి దీప్తి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా సి. క్యాంపులోని ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో శనివారం ఉదయం 10 గంటలకు ముఖాముఖి కార్యక్రమం ప్రాంభమవుతుందన్నారు. ఈ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.