నేటి మంత్రి పర్యటన వివరాలు
WNP: పానగల్ మండలంలోని బుసిరెడ్డిపల్లి గ్రామంలో నేడు మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించనున్నారు. నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించడంతో పాటు, బుసిరెడ్డిపల్లి కేతేపల్లి బీటీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేస్తారని మాజీ ఎంపీపీ వెంకటేశ్ నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరుకావాలని ఆయన కోరారు.