అమ్మవారి విగ్రహాల ధ్వంసం

SKLM: టెక్కలి మండలం మేఘవరం పంచాయతీ పరిధిలోని జీడి పేట గిరిజన గ్రామం సమీపంలో ఉన్న శ్రీ వనదుర్గమ్మ తల్లి ఆలయంలోని విగ్రహాలను 2 రోజుల క్రితం దుండగులు ధ్వంసం చేశారు. ఘటనకు సంబంధించిన ఫొటోలు శుక్రవారం నాటికి సామాజిక మాధ్యమాల ద్వారా ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. విగ్రహాలు ధ్వంసం చేయడం చుట్టు పక్కల ప్రాంతాల్లో చర్చనీయాంశంగా మారింది.