పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయ ఢంకా: MLA
SDPT: దుబ్బాక నియోజకవర్గంలో జరిగిన సర్పంచ్ ఎన్నికల తొలి, రెండు విడతల్లో మొత్తం 141 గ్రామపంచాయతీ స్థానాలకు గాను 84 స్థానాలను గెలుచుకొని బీఆర్ఎస్ పార్టీ చారిత్రాత్మక విజయాన్ని సాధించిందని MLA కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం దుబ్బాక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విజయం సాధించిన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులను అభినందించారు.