శిక్షణ పూర్తి చేసుకున్న ఆపద మిత్ర వాలంటీర్లకు అభినందనలు

శిక్షణ పూర్తి చేసుకున్న ఆపద మిత్ర వాలంటీర్లకు అభినందనలు

AKP: జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో భువనేశ్వర్ లో నిర్వహించిన ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకుని వచ్చిన పది మంది ఆపద మిత్ర వాలంటీర్లను కలెక్టర్ విజయ్ కృష్ణన్ శనివారం అభినందించారు. శిక్షణ సమయంలో నేర్చుకున్న మెలకువలను అత్యవసర సమయాల్లో వినియోగించాలని కలెక్టర్ సూచించారు. జాయింట్ కలెక్టర్ జాహ్నవి పాల్గొన్నారు.