విద్యార్థినులతో నేలపైనే కూర్చున్న రామ్మోహన్

విద్యార్థినులతో నేలపైనే కూర్చున్న రామ్మోహన్

AP: శ్రీకాకుళంలోని ప్రభుత్వ బాలికల కళాశాలను కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు సందర్శించారు. కళాశాలలో అదనపు భవనాలను ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. వేదిక ఎదురుగా విద్యార్థినులు కింద కూర్చొని ఉన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి సైతం వారితో కలిసి నేలపైనే కూర్చున్నారు. అనంతరం విద్యార్థినులతో సరదాగా ముచ్చటించారు.