ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి భవానీ దీక్షల విరమణ
NTR: ఇంద్రకీలాద్రిపై గురువారం నుంచి ప్రారంభంకానున్న భవానీ మండల దీక్ష విరమణకు ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ నెల 15 వరకు కొనసాగనున్న ఈ కార్యక్రమానికి 7 లక్షల మంది భవానీలు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. గిరి ప్రదక్షిణకు 9 కి.మీ. మార్గాన్ని సిద్ధం చేశారు. భవానీల కోసం 3 హోమగుండాలు, నిత్య అన్నదానం ఏర్పాటు చేశారు.