సోలార్ కంచె ఏర్పాటుతో గజ దాడులకు చెక్
CTR: అటవీ ప్రాంత సరిహద్దుల వద్ద సోలార్ కంచె ఏర్పాటుతో ఏనుగుల గుంపు దాడులను నివారించడం జరుగుతుందని పుంగనూరు టీడీపీ నేత చల్లా రామచంద్రారెడ్డి తెలిపారు. పులిచెర్ల మండలం కమ్మపల్లి పంచాయతీ పరిధిలోని అటవీ సరిహద్దులో శనివారం సోలార్ కంచె నిర్మాణం పనులకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అటవీ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.