మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌గా పల్లవి
అనంతపురం మార్కెట్ యార్డ్ ఛైర్మన్‌గా అవకాశం కల్పించినందుకు బల్లా పల్లవి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్‌కు, అనంతపురం MLA దగ్గుపాటి ప్రసాద్‌కు కూడా ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. తన పదవి ద్వారా రైతులు, ప్రజల అభివృద్ధికి కృషి చేస్తానని పల్లవి పేర్కొన్నారు.