'GST స్లాబుల తగ్గింపుతో పేదలకు భారీగా లబ్ధి'

'GST స్లాబుల తగ్గింపుతో పేదలకు భారీగా లబ్ధి'

TG: నాయకత్వ లోపమే ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కావడానికి కారణమని MP రఘునందన్ రావు అన్నారు. PM మోదీ నాయకత్వంలో భారత్ అంత్యోదయం వైపు పయనిస్తోందని తెలిపారు. గడచిన 11 ఏళ్లలో 25 కోట్ల మంది ప్రజలను దారిద్య్రరేఖకు ఎగువకు తీసుకువచ్చామని పేర్కొన్నారు. GST స్లాబుల తగ్గింపు నిర్ణయం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలకు నెలకు రూ. 3 వేల నుంచి రూ. 4 వేల వరకు లాభం చేకూరుతుందన్నారు.