“డ్రగ్స్ వద్దు బ్రో” నినాదంతో అవగాహన కార్యక్రమం

“డ్రగ్స్ వద్దు బ్రో” నినాదంతో అవగాహన కార్యక్రమం

అన్నమయ్య: రాయచోటి పట్టణంలో EAGLE సెల్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ట్రాఫిక్ సీఐ కుళ్ళయప్ప మాట్లాడుతూ.. డ్రగ్స్‌కు సంబంధించిన కార్యకలాపాలు NDPS చట్టం ప్రకారం తీవ్రమైన నేరమని హెచ్చరించారు. అనుమానాస్పద విషయాలు గమనిస్తే 1972 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. డ్రగ్స్ రహిత సమాజం కోసం అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.