రేపు కనిగిరిలో పర్యటించనున్న బీవీ రాఘవులు

రేపు కనిగిరిలో పర్యటించనున్న బీవీ రాఘవులు

ప్రకాశం: కనిగిరి పట్టణంలోని సుందరయ్య భవన్‌ను దాతల సహకారంతో పునర్నిర్మించారు. ఈ సందర్భంగా భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఈనెల 23న నిర్వహించనున్నట్లు కనిగిరి పట్టణ సీపీఎం కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు పాల్గొంటారన్నారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు వెలిగొండ జలాల సాధన సదస్సు జరుగుతుందని అన్నారు.