'చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి'
WGL: ఎమ్మార్పీఎస్ MSP ఆధ్వర్యంలో కాశిబుగ్గ అంబేద్కర్ విగ్రహం వద్ద ఈరోజు దళిత ఆత్మ గౌరవ ప్రదర్శన కరపత్రం గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా MSP జిల్లా అధ్యక్షుడు కళ్లేపెళ్లి ప్రణయ్ దీప్ మాదిగ మాట్లాడుతూ.. సీజే గవాయ్‌పై దాడి చేసిన నిందితుని కఠినంగా శిక్షించాలన్నారు. ఈ నెల 17 ఢిల్లీలో నిర్వహించే ఆత్మ గౌరవ ప్రదర్శన విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు.