ముగిసిన భగవద్గీత అవగాహన కార్యక్రమాలు

KDP: సిద్ధవటం మండలంలోని మాధవరం-1 గ్రామంలోని శ్రీ బద్రావతి సమేత భావనారాయణ స్వామి, శ్రీ కోదండ రామస్వామి ఆలయ ప్రతినిధుల ఆధ్వర్యంలో భగవద్గీత పఠనంపై గత 3 రోజులపాటు నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు బుధవారం నాటికి ముగిశాయి. సిద్ధవటం ఏఎస్సై సుబ్బరామచంద్ర భగవద్గీత పఠనంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ ప్రతినిధులు ASI సుబ్బరామచంద్రను ఘనంగా సన్మానించారు.