క్రీడా పోటీలను ప్రారంభించిన బలరాం జాధవ్

ADB: బోథ్ మండలం బాబేర గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి కబడ్డీ, వాలీబాల్ క్రీడా పోటీలను శనివారం రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ఆదివాసి గిరిజన యువతీ యువకులు కచ్చితంగా ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకొని రాష్ట్ర స్థాయిలోరాణించాలన్నారు. క్రీడలను స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు.