'మెగా లోక్ అదాలత్‌లో 6,362 కేసుల పరిష్కారం'

'మెగా లోక్ అదాలత్‌లో 6,362 కేసుల పరిష్కారం'

నల్లగొండ జిల్లాలో జరిగిన జాతీయ మెగా లోక్ అదాలత్‌లో మొత్తం 6362 కేసులు పరిష్కరించబడ్డాయని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. వివిధ పోలీస్ స్టేషన్ల్‌లో ఉన్న అండర్ ఇన్వెస్టిగేషన్, కోర్టు కేసులు 548, డ్రంక్ అండ్ డ్రైవ్ / MV యాక్ట్ కేసులు 2515, పెట్టి కేసులు 3254 పరిష్కరించారు. అలాగే సైబర్ క్రైమ్ 45 కేసుల్లో రూ. 8,84,642 రూపాయలు బాధితులకు తిరిగి అందజేశారు.