కొవ్వొతులతో వైసీపీ నాయకుల నిరసన

KDP: వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ఆదేశాల మేరకు కడప పట్టణంలో వైసీపీ కార్యాలయం నుంచి గోకుల్ సర్కిల్, మహాత్మా గాంధీ సర్కిల్, వైయస్ ఆర్ సర్కిల్ వరకు మాజీ ఉపముఖ్యమంత్రి అంజాద్ బాషా, ఎమ్మెల్సీ రామచంద్ర రెడ్డిలు కొవ్వొతులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.