పోలీస్ డ్యూటీ మీట్‌కి అసిస్టెంట్ కోచ్‌గా అంజయ్య

MHBD: జిల్లా పోలీస్ కానిస్టేబుల్ అంజయ్య, 69వ ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్‌కు అసిస్టెంట్ కోచ్‌గా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ బుధవారం ఆయనను సన్మానించారు. గతంలో జరిగిన 61వ ఆల్ ఇండియా పోలీస్ డ్యూటీ మీట్‌లో చెన్నైలో బ్రాంజ్, 68వ మీట్‌లో జార్ఖండ్‌లో సిల్వర్ మెడల్ సాధించిన ఘనత అంజయ్యకు దక్కింది.