నేరగాళ్లకు పోలీసులు ప్రత్యేక కౌన్సిలింగ్

నేరగాళ్లకు పోలీసులు ప్రత్యేక కౌన్సిలింగ్

కృష్ణా: లైంగిక నేరగాళ్ల షీట్ హోల్డర్లపై గుడ్లవల్లేరు పోలీసులు ప్రత్యేక కౌన్సెలింగ్ శనివారం నిర్వహించారు. భవిష్యత్తులో ఇలాంటి నేరాలకు పాల్పడవద్దని ఎస్సై సత్యనారాయణ హెచ్చరించారు. చట్టపరమైన చర్యలు ఎంత కఠినంగా ఉంటాయో వివరించడంతో పాటు, నేరాల వల్ల వ్యక్తి, కుటుంబం, సమాజంపై కలిగే దుష్ప్రభావాలను తెలియజేశారు.