నవరాత్రి వేడుకలకు హాజరుకావాలని MLAకు ఆహ్వానం

నవరాత్రి వేడుకలకు హాజరుకావాలని MLAకు ఆహ్వానం

HNK: నగరంలో చరిత్ర ప్రసిద్ధిగాంచిన హనుమద్గిరి శ్రీ పద్మాక్షి ఆలయంలో ఈనెల 22 నుంచి వచ్చేనెల 4వ తేదీ వరకు శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. ఈ ఉత్సవాలకు హాజరుకావాలని వరంగల్ పశ్చిమ MLA నాయిని రాజేందర్ రెడ్డిని ఆలయ అర్చకులు, సిబ్బంది ఆహ్వానించారు. గురువారం వారు MLAను కలిసి ఆహ్వానపత్రిక అందజేసారు.