కారుతో చెట్టుకు ఢీ కొట్టిన యువకుడు
SRD: కొండాపూర్ మండలంలోని చర్ల గోపురం వద్ద గురువారం సాయంత్రం కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. మద్యం మత్తులో కారు నడిపిన రాజేందర్ (42) కాలు, చేతి వేలు విరిగి తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది లావణ్య, రమేష్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, ప్రథమ చికిత్స అందించి సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమయస్ఫూర్తితో స్పందించిన 108 సిబ్బందికి స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.