పెనుగొండ: వృధాగా పోతున్న మంచినీరు

పశ్చిమగోదావరి: పెనుగొండ పంచాయతీ పరిధిలో వివిధ ప్రాంతాల్లో వీధి కులాయి నుంచి మంచినీరు వృధాగా పోతుంది. దీంతో.. గృహిణులు నీరు అందక అవస్థలు పడుతున్నామని తెలుపుతున్నారు. తక్షణమే పంచాయతీ అధికారులు స్పందించి వీధి కులాయిలకు మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.