డాక్‌యార్డ్ బ్రిడ్జి పైనుంచి రాకపోకలు ప్రారంభం
విశాఖ: సర్దార్ వల్లభాయ్ పటేల్ వంతెన పైనుంచి ఎట్టకేలకు రాకపోకలు ప్రారంభమయ్యాయి. మంగళవారం ఎమ్మెల్యే గణబాబు తన అనుచరులతో కలిసి కాన్వాయ్‌తో బ్రిడ్జిపై రాకపోకలు చేస్తూ ప్రజలకు అభివాదం చేశారు. పోర్టు యాజమాన్యం రూ. 15 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బ్రిడ్జి పనులు చేపట్టిందని ఎమ్మెల్యే వివరించారు. కాగా 20 నెలలుగా బ్రిడ్జి పైనుంచి రాకపోకలు బంద్ అయిన విషయం తెలిసిందే.