నేడు ఉచిత వైద్య పరీక్షలు.. ఎక్కడంటే.?
CTR: పలమనేరు ప్రభుత్వ హోమియో వైద్యశాలలో ఉచిత ఎముకల పటుత్వ పరీక్షలు చేపడుతున్నట్లు వైద్యాధికారి డాక్టర్ ఉమారాణి ఒక ప్రకటనలో తెలిపారు. చెన్నైకి చెందిన ఫోర్ట్సుకంపెనీ ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారని పేర్కొన్నారు. ఇవాళ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. స్థానికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.