ఉపాధి హామీ పనుల పరిశీలన చేసిన సర్పంచ్

ఉపాధి హామీ పనుల పరిశీలన చేసిన సర్పంచ్

WGL: రాయపర్తి మండలం జయరాం తండాలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను సర్పంచ్ గుగులోత్ రమేష్ బుధవారం పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పనులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని అధికారులకు సూచించారు. పనులను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని తెలిపారు. శ్రామికులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని సంబంధిత సిబ్బందికి ఆదేశించారు.