కెనాల్ బ్రిడ్జి రాకపోకలు తాత్కాలిక నిలిపివేత
MLG: మల్లంపల్లి కెనాల్ బ్రిడ్జి మీదుగా ఈరోజు యథావిధిగా రాకపోకలు కొనసాగుతాయని, రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు NH ఏఈ చైతన్య తెలిపారు. రేగొండ మండలంలో బుగులోని జాతర కారణంగా వాహనాలు దారి మళ్లిస్తే ట్రాఫిక్ ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వాహనదారులు గమనించి సహకరించాలని కోరారు.