'వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లలో కాంగ్రెస్ గెలుపు'
MNCL: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 100 సీట్లలో గెలుపు ఖాయమని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. శుక్రవారం జరిగిన జిల్లా కాంగ్రెస్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడ లేనివిధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. కులమతాలు రెచ్చగొట్టే బీజేపీకి తెలంగాణలో చోటు లేదని, వాటాల గొడవలతో బీఆర్ఎస్ రోడ్డున పడిందని విమర్శించారు.